తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మికం పీఠం సదస్సు - ఆధ్యాత్మిక సదస్సులు

సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని సూచించారు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి ఉమర్​ అలీషా. హైదరాబాద్​లో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Breaking News

By

Published : May 12, 2019, 4:58 PM IST

హైదరాబాద్​లోని స్థానిక మధురానగర్​లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. దీనికి పీఠాధిపతి డాక్టర్​ ఉమర్​ అలీషా ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రజలకు ఆధ్యాత్మిక తత్వం గురించి హిత బోధనలు చేశారు. సదస్సుకు ఈటీవీ చీఫ్​ ఇంజినీర్​ ఎస్​ఎల్​ కే ప్రసాదరావు, మాజీ న్యాయమూర్తులు జస్టిస్​ లింగేశ్వరరావు, జస్టిస్​ నాగ మారుతి, ఉస్మానియా రిటైర్డ్​ ప్రొఫెసర్​ ఆచార్య మసన చెన్నప్ప పాల్గొన్నారు.

తల్లిని గౌరవించాలి

సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికం అలవర్చుకోవాలని ఫీఠాధిపతి డాక్టర్​ ఉమర్​ అలీషా అన్నారు. జన్మనిచ్చిన తల్లిని అందరూ గౌరవించాలని బోధించారు. కులమతాలకు అతీతంగా ఈ పీఠం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడిచి... సనాతన ధార్మిక సిద్ధాంతం కొరకు పాటు పడాలని సూచించారు. ట్రస్టు చేస్తోన్న సేవలను వివరించారు.

హైదరాబాద్​లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మికం పీఠం సదస్సు

ఇదీ చూడండి : 'అమ్మలు అందరూ స్ఫూర్తిప్రదాతలే....'

ABOUT THE AUTHOR

...view details