రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలోని కుంట్లూర్‌లో గాంధీ కుటీర్ ప్రాంగణంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ సంయుక్త ఆధ్వర్యంలో విశ్వకవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. సత్యం, అహింస సిద్ధాంతాల పైనే ప్రపంచమంతా మనుగడ సాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్ర కోసం నాడు సర్వం అర్పించిన త్యాగధనుల జీవితాలను నేటి యువతకు తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని గుర్తు చేశారు.
కుంట్లూర్‌లో విశ్వకవి సమ్మేళనం... హాజరైన ఎమ్మెల్సీ - ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి తాజా వార్తలు
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలోని కుంట్లూర్‌లో విశ్వకవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటి స్వాతంత్య్ర పోరాట యోధుల మహత్యాన్ని నేటి యువతకు తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని ఆయన గుర్తు చేశారు.
కుంట్లూర్‌లో విశ్వకవి సమ్మేళనం... హాజరైన ఎమ్మెల్సీ
తెలుగు రాష్ట్రాల నుంచి 180 మంది కవులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. వారికి శాలువా కప్పి, జ్ఞాపికతో ఛైర్మన్ రాజేందర్ రెడ్డి సత్కరించారు.
ఇదీ చదవండి:కరోనాతో జాగ్రత్తగా లేకుంటే అంతే సంగతి: సీసీఎంబీ డైరెక్టర్
Last Updated : Nov 9, 2020, 10:42 AM IST