అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి అందాలను తిలకించేందుకు నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రజల కోసం వంతెనపై అనుమతిస్తున్నట్లు తెలపడం వల్ల వీక్షించేందుకు సందర్శకులు వచ్చారు. కానీ సందర్శకులకు అనుమతి లేకపోవడం వల్ల చాలా మంది నిరాశతో వెనుదిగిరి వెళ్లిపోయారు. మరికొందరు చరవాణిలో స్వీయ చిత్రాలు దిగుతూ సందడి చేశారు. బ్రిడ్జి చాలా బాగుందని... కానీ లోపలికి అనుమతి లేకపోవడం వల్ల నిరాశ చెందినట్లు సందర్శకులు తెలిపారు.
కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు భారీగా తరలివచ్చిన సందర్శకులు - Visitors flocked heavily to see the cable bridge
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి అందాలను చూసేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కానీ సందర్శకులకు అనుమతి లేకపోవడం వల్ల నిరాశతో వెనుదిరిగారు.
కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు భారీగా తరలివచ్చిన సందర్శకులు