తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నేటి నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. కేబుల్ బ్రిడ్జి పై నేడు సాయంత్రం 5.30 గంటలకు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో సింఫోనీ బ్యాండ్ ఏర్పాటు చేశారు. లైవ్ బ్యాండ్ ప్రదర్శనలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కోరారు. ఉత్తర సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, జీహెచ్ఎంసీ శానిటేషన్ కరోనా వారియర్ల సేవలకు సంఘీభావంగా ఈ బ్యాండ్ ప్రదర్శన ఉండనుందని ఆయన వివరించారు. 45 నిమిషాల పాటు ప్రదర్శన ఉంటుందని.. వందేమాతరంతో ప్రారంభించి పలు దేశ భక్తి గీతాలు, భారతీయ, పాశ్చాత్య గీతాలు, సంగీతాన్ని ప్రదర్శించి “జయహోతో ముగింపు తెలపనున్నట్లు పేర్కొన్నారు.
కేబుల్ బ్రిడ్జిపై నేటి నుంచి సందర్శకులకు అనుమతి - కేబుల్ బ్రిడ్జిపై నేటి నుంచి సందర్శకులకు అనుమతి
అట్టహాసంగా ప్రారంభమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నేటి నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. కేబుల్ బ్రిడ్జి పై నేడు సాయంత్రం 5.30 గంటలకు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో సింఫోనీ బ్యాండ్ ఏర్పాటు చేశారు.
కేబుల్ బ్రిడ్జిపై నేటి నుంచి సందర్శకులకు అనుమతి