తెలంగాణ

telangana

ETV Bharat / state

'రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహాయం చేయండి'

రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు తమ వంతుగా సహాయం అందించాలని విశ్వహందూ పరిషత్‌ తెలంగాణ శాఖ పిలుపునిచ్చింది. ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు రామ జన్మభూమి మందిర నిర్మాణం కోసం నిధుల సమీకరణ ప్రక్రియ కొనసాగనుందని తెలిపింది.

Vishwa Hindu Parishad, Telangana branch calls on everyone to help in the construction of the Ram Mandir in Ayodhya.
'రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహాయం చేయండి'

By

Published : Jan 5, 2021, 8:47 PM IST

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు తమ వంతుగా సహాయం అందించాలని విశ్వహందూ పరిషత్‌ తెలంగాణ శాఖ పిలుపునిచ్చింది. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి అభియన్‌ ప్రతిష్ఠిత వ్యక్తుల సమ్మేళనం జరిగింది.

ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు రామ జన్మభూమి మందిర నిర్మాణం కోసం నిధుల సమీకరణ ప్రక్రియ కొనసాగనుందని తెలిపారు. ఈ సందర్బంగా 'కోవిదా సహృదయ ఫౌండేషన్' వ్యవస్థాపకురాలు, ప్రతిష్ఠిత వ్యక్తులలోని సభ్యురాలైన అనూహ్య రెడ్డి రూ. లక్ష 11వేల 116 చెక్‌ను రామమందిర నిర్మాణం కోసం అందజేశారు.

ప్రతిష్ఠిత వ్యక్తుల సమావేశంలో పాల్గొడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. రామమందిరి నిర్మాణ నిధుల సమీకరణ అనేది ఎంతో పవిత్రమైన కార్యక్రమమని... ఇందుకోసం ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు నిధుల సమీకరణ కోసం తాను చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి నిధులు సమీకరిస్తానని అనూహ్య రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:దారుణం: మూడేళ్ల చిన్నారిపై బాలుడు అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details