దేశవ్యాప్తంగా ఐక్యతా దినోత్సవ వేడుకలు జరుగుతున్నా.. హైదరాబాద్ సంస్థాన విలీనంలో ఆయన పోషించిన ముఖ్య భూమిక తనను ఇక్కడి వేడుకల్లో పాల్గొనేలా పురిగొల్పిందని వెంకయ్యనాయుడు తెలిపారు. సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లాభాయ్ పటేల్ వంటి మహనీయుల చరితలను భావితరాలకు చేరవేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశప్రజలంతా ఐక్యతతో మెలిగి.. దేశ అభ్యున్నతిలో భాగస్వాములు కావడమే మనం ఆ మహనీయులకు ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం... ప్రజాస్వామ్యబద్ధం: వెంకయ్యనాయుడు - vise president venkayya naidu participated in sardar vallabhai patel birth anniversary
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉక్కుమనిషి సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగతోపాన్యాసంలో ఆయన మాట్లాడారు.

'ప్రజలంతా ఐక్యతతో మెలిగి అభ్యున్నతిలో భాగస్వాములవ్వడమే మహనీయులకిచ్చే నివాళి'
'ప్రజలంతా ఐక్యతతో మెలిగి అభ్యున్నతిలో భాగస్వాములవ్వడమే మహనీయులకిచ్చే నివాళి'
ఇదీ చూడండి: దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ