తెలంగాణ

telangana

ETV Bharat / state

VISAKHA SRI SARADA PEETHAM: ఆ వేద విద్యార్థుల కుటుంబాలకు సాయం - కృష్ణా నదిలో మృతి చెందిన వేద విద్యార్థులు

VISAKHA SRI SARADA PEETHAM: గుంటూరు జిల్లా మాడిపాడు ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందిస్తామని విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. మిగిలిన విద్యార్థులను తమ వేద పాఠశాలలో చదివిస్తామని వెల్లడించారు.

VISAKHA SRI SARADA PEETHAM
వేద విద్యార్థుల కుటుంబాలకు సాయం

By

Published : Dec 11, 2021, 11:45 AM IST

Visakha Sri Sarada Peetham: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా మాడిపాడు విషాదంపై విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి స్పందించారు. వేదపాఠశాల విద్యార్థుల మృతి వార్త కంటతడి పెట్టించిందని భావోద్వేగానికి లోనయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.50 వేలు చొప్పున సహాయం అందిస్తామని ప్రకటించారు. మిగిలిన విద్యార్థులను తమ వేద పాఠశాలలో చదివిస్తామని వెల్లడించారు.

Students death in Guntur : గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాడిపాడు వద్ద పెనువిషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని శ్వేత శృంగాచలం వేద వేదాంత గురుకుల వేద పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కృష్ణా నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈత రాకపోవడంతో వారంతా నదీ ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు, గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం శర్మ, హర్షిత్ శుక్లా, శుభమ్ త్రివేది, అన్షుమాన్ శుక్లా, శివ శర్మ, నితీష్ కుమార్​లు మృతి చెందినట్లు గుర్తించారు. వీరిలో సుబ్రహ్మణ్యం శర్మ నరసరావుపేట, శివ శర్మ మధ్యప్రదేశ్ చెందిన వారు కాగా... మిగిలిన నలుగురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఈ ఘటనలో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీచదవండి:students drown in krishna river: కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు మృతి

ABOUT THE AUTHOR

...view details