ఏపీ విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో బాధితులకు ఆసుపత్రుల్లో చేదు అనుభవం ఎదురవుతోంది. చికిత్స కోసం ఆసుపత్రులకు వెళితే వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారా అని కొంతమంది వైద్య సిబ్బంది మాట్లాడుతున్నారని బాధితులు వాపోతున్నారు.
బాధితులకేది బాసట.. ఆపదలో అవహేళనా?
ఒక్క రాత్రిలో వారి ప్రపంచం తలకిందులైపోయింది. విషవాయువు వారి ఆప్తులను తీసుకెళ్లిపోయింది. ఆనందం నిద్రపోయిన చిన్నారులను నిద్రలోనే ప్రాణాంతక పొగ కమ్మేసింది. ఏపీలోని విశాఖ దుర్ఘటన బాధితుల వేదన ఇది. ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల వాసులు కన్నీటి వ్యథ ఇది. ప్రమాదంలో సొంతవారిని కోల్పోయిన వారికి బాసటగా నిలవాల్చిన సమయంలో.. వారిని కొందరి మాటలు మరింత వేధిస్తున్నాయి. చికిత్స కోసం ఆసుపత్రులకు వెళితే పరిహారం కోసం చేరుతున్నారా.. అని అవహేళన చేస్తున్నారు.
బాధితులకేది బాసట.. ఆపదలో అవహేళనా?