Cyclone Jawad warning for AP: తుపాను రక్షణ చర్యల్లో భాగంగా.. ఏపీలోని విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే 3 ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. జీవీఎంసీ పరిధిలో 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. తుపాను తీవ్రత దృష్ట్యా పాఠశాలలకు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. రెండ్రోజులపాటు పర్యాటక ప్రాంతాలకు అనుమతి నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..
control rooms in visakhapatnam: విశాఖపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా విశాఖ కంట్రోల్ రూమ్ నెంబర్లు.. 0891-2590100, 2590102, 2750089, 2750090, 2560820కు ఫోన్ చేయాలని సూచించారు.