రోగుల సంఖ్య పెరుగుతుండడం వల్ల గాంధీ ఆసుపత్రి కిటకిటలాడుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు వస్తున్నాయని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ అన్నారు. రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండడం వల్ల తాము అన్ని రకాల చర్యలను చేపట్టినట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఆదివారం రోజున కూడా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. డీఎంఈ ఆదేశాల మేరకు ఆదివారం రోజున వైరల్ ఫీవర్ బారిన పడిన వారి కోసం ప్రత్యేకంగా చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు.
గాంధీ ఆసుపత్రిలో ఆదివారం కూడా ఓపీ సేవలు - fever
రోజు రోజుకు వైరల్ ఫీవర్ అధికం అవుతుండడంతో గాంధీ ఆసుపత్రిలో ఆదివారం కూడా ఓపీ విభాగాన్ని నడిపిస్తున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.
గాంధీ ఆసుపత్రిలో ఆదివారం కూడా ఓపీ సేవలు