తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక, సినీ దర్శకుడు బాబి, డ్రమ్స్ శివమణి దర్శించుకున్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. త్వరలో చిరంజీవితో ఓ చిత్రం తీయనున్నట్లు బాబి ప్రకటించారు.
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - VIPS visit tirumala in chittor district
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక, సినీ దర్శకుడు బాబి, డ్రమ్స్ శివమణి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
ఏపీ అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని ఏపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన జన్మదినం సందర్బంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని... ఆశీస్సులు పొందానన్నారు. ఏపీ అధికారపక్షం, ప్రతిపక్షం అసెంబ్లీలో సమన్వయంతో ఉండాలన్నారు. అర్థవంతమైన చర్చలతో... ప్రజాసమస్యలను పరిష్కరించేలా దృష్టి పెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి:గ్రేటర్‌లో ఓటేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు