గుండా మల్లేశ్ భౌతికకాయాన్ని కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుమ్ భవన్‌కు తరలించారు. గుండా మల్లేశ్ పార్థీవ దేహం వద్ద వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. దేవాదయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా గుండా మల్లేశ్‌కు నివాళులర్పించారు.
గుండా మల్లేశ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సాధారణ జీవితం గడిపారని దేవాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆయన మరణం పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు తీరని లోటన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పాటు పడేవారని ఎల్.రమణ కొనియాడారు. సింగరేణి కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు.