లాక్డౌన్ వల్ల దాదాపు 50 రోజులుగా మూసిఉన్న సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్ 'టేక్ అవే' పేరుతో పార్సెల్ సర్వీసులను వినియోగదారులకు అందజేస్తుంది. టేక్ అవే ఆర్డర్లు ఇస్తున్నారన్న సమాచారంతో ప్రజలు ఒక్కసారిగా హోటల్ వద్ద భౌతిక దూరం పాటించకుండా బిర్యానీ కోసం క్యూ కట్టారు. దీనిని చూసిన జీహెచ్ఎంసీ అధికారులు హోటల్‌ను మూయించేశారు.
లాక్డౌన్ బేఖాతరు.. ప్యారడైజ్ 'టేక్ అవే' బంద్ - లాక్డౌన్ ఆంక్షల ఉల్లంఘన ప్యారడైజ్ హోటల్ మూసివేత
లాక్డౌన్ ఆదేశాలను బేఖాతరు చేసిందంటూ భాగ్యనగరంలో ప్రముఖ హోటల్లో ఒకటైన ప్యారడైజ్ హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు మూసేశారు.
లాక్డౌన్ బేఖాతరు.. ప్యారడైజ్ 'టేక్ అవే' బంద్
జనాలు హోటల్ వద్ద గుమిగూడండం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యజమానులను హెచ్చరించారు.
ఇదీ చూడండి:'మన జీవన విధానం ద్వారానే కరోనాను అడ్డుకోవచ్చు'