హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 42కి పెంచినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టులో జడ్జి పోస్టులను 24 నుంచి 42కి పెంచడం హర్షణీయమన్నారు. పెండింగులో పేరుకుపోతోన్న కేసుల సత్వర విచారణకు ఇది దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.
జస్టిస్ ఎన్వీ రమణకు ధన్యవాదాలు తెలిపిన వినోద్‌కుమార్ - Boinapalli Vinod Kumar latest news
హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచినందుకు గానూ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్ కేసుల సత్వర విచారణకు ఇది దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.
హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 ఫిబ్రవరిలో ప్రధాని, కేంద్ర న్యాయశాఖ మంత్రి, సీజేఐలకు లేఖలు రాశారని వినోద్‌కుమార్ గుర్తు చేశారు. జడ్జిల సంఖ్య పెంచాలని 2019లో తాను పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటు కేంద్ర పెద్దలతో పలుమార్లు చర్చించినట్లు పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా కోరుతున్న విధంగా హైకోర్టు జడ్జిలను 42కి పెంచడం పట్ల సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు తెరాస న్యాయ విభాగం ధన్యవాదాలు తెలిపింది. కొత్తగా మంజూరైన జడ్జిల పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ అయ్యేలా చూడాలని సీజేఐని తెరాస లీగల్ సెల్ కోరింది.
ఇదీ చూడండి:ts high court: 'చారిత్రక కట్టడాలను సర్వే చేసి అభివృద్ధి చేయాలి'