తెలంగాణ

telangana

ETV Bharat / state

'నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే' - boinapally vinod kumar latest news

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషిని తెలుసుకోకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి సంతోష్​కుమార్​ పేర్కొన్నారు. కనీస విషయ పరిజ్ఞానం లేకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నదీ జలాల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

vinod kumar said that The responsibility for resolving the river waters dispute lies with the Center
'నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే'

By

Published : Oct 5, 2020, 7:37 AM IST

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాలని అప్పటి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కేంద్రం తీరు సరిగాలేదు..

గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర జల వనరుల శాఖ మంత్రులు ఉమా భారతి, నితిన్ గడ్కరీలకు లేఖలు రాసినా స్పందించలేదని ఆయన విమర్శించారు. సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి ఉమా భారతి ప్రయత్నం చేస్తున్న దశలో మహారాష్ట్ర, కర్నాటక భాజపా ఎంపీలు లోక్​సభలో అడ్డుకుని తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. చివరకు సుప్రీంకోర్టులో సవాలు చేసినా.. కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లేదని వినోద్ కుమార్ వివరించారు.

భాజపాది అవగాహనా రాహిత్యం

నదీ జలాల వివాద పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషిని తెలుసుకోకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. కనీస విషయ పరిజ్ఞానం లేకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఇది వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించాలనే విశాల దృక్పథంతో కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారని ఆయన వెల్లడించారు.

పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరి వల్ల దశాబ్దాల నుంచి అనేక ప్రాజెక్టులు అమలుకు నోచుకోలేదని వినోద్ కుమార్ గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​లకు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రధాని మోదీ, కేంద్ర జల వనరుల శాఖ మంత్రులపై ఒత్తిడి తెచ్చి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపుల కోసం ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్​కు ఆదేశాలు ఇప్పించేందుకు కృషి చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: రెండు గంటల్లో కాజీపేట నుంచి విజయవాడ చేరుకున్న రైలు!

ABOUT THE AUTHOR

...view details