రాష్ట్రంలో ఖరీఫ్‌లో 59 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 61 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెబితే భాజపా నేతలు తప్పు పట్టారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వరి సాగు లెక్కలపై అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.
రిమెట్ సెన్సింగ్ సెంటర్... కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జాతీయ స్థాయిలో ఖరీఫ్ పంట ముఖ్యంగా వరి ధాన్యంపైన వారు దేశవ్యాప్తంగా రిమోట్ సెన్సింగ్ డేటా తీశారు. దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో 2.374 మిలియన్ హెక్టార్లు అంటే 59 లక్షల ఎకరాల్లో వరిధాన్యం తెలంగాణలో సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగైన వివరాలను ఈ నివేదిక చెప్పింది. ఇదే సందర్భంలో వరిధాన్యం ఎంత పండుతుంది అనేది కూడా మిలియన్ టన్నుల్లో చెప్పడం జరిగింది. 7.543 మిలియన్ టన్నులు. ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 62 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి సాగవుతోందని చెప్తే భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ అపహాస్యం చేశారు. ఎక్కడ వేశారు చూపిస్తారా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిపై ఏం సమాధానం చెప్తారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను.
-వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర సర్కార్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నాడు తెరాస ధర్నా(TRS Dharna over Paddy procurement) చేపట్టింది. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. రైతుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న వైఖరి పట్ల కేంద్రం మెడలు వంచేలా ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది.
తెరాస అంటే.. తెలంగాణ రైతు సమితి :
కేటీఆర్ధాన్యం కొనుగోళ్లపై తెరాస ధర్నాలో భాగంగా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ( ktr fires on bjp during trs dharna) పాల్గొన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. తెరాస శ్రేణులతో కలిసి ఆయన ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఇప్పటి నుంచి తెరాస అంటే.. తెలంగాణ రైతు సమితి అని కేటీఆర్ ( ktr fires on bjp during trs dharna) స్పష్టం చేశారు. రైతుల ఉత్సాహం చూస్తుంటే మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తోందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరోసారి రైతులంతా ఉద్యమించాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో ఏడున్నరేళ్ల క్రితం మన పాలన ప్రారంభమైందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడక.. ముందు రైతుల దుస్థితి ఏందో ఆలోచించాలని సూచించారు. నాడు విద్యుత్, విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేసే (trs dharna on grain purchase) దుస్థితి ఉండేదని.. కాంగ్రెస్ హయాంలో కనీసం ఐదారు గంటలు కూడా విద్యుత్ వచ్చేది కాదని విమర్శించారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వేసినా నీళ్లు రాక అప్పుల పాలయ్యారని.. గతంలో చెరువులు, కుంటలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువని పార్లమెంట్‌లోనే చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. నిరంతర విద్యుత్ సరఫరా తీసుకొచ్చిన ఏకైక సీఎం మన కేసీఆర్. రైతులకు మంచి జరగాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే.
ఇదీ చదవండి:Harish Rao on Fuel price: '16సార్లు పెంచి... ఒక్కసారి తగ్గించి.. మేలు చేసినట్లు కేంద్రం డ్రామా'