తెలంగాణ

telangana

ETV Bharat / state

Vinod kumar on BJP: బండి సంజయ్​కు దీక్ష చేసే నైతికత ఎక్కడుంది: వినోద్​ కుమార్​ - vinod comments on central government

Vinod kumar on BJP: బండి సంజయ్​కు దీక్ష చేసే నైతికత ఎక్కడుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రశ్నించారు. అన్ని వర్గాల నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న భాజపాకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

Vinod kumar on BJP: బండి సంజయ్​కు దీక్ష చేసే నైతికత ఎక్కడుంది: వినోద్​ కుమార్​
Vinod kumar on BJP: బండి సంజయ్​కు దీక్ష చేసే నైతికత ఎక్కడుంది: వినోద్​ కుమార్​

By

Published : Dec 26, 2021, 10:07 PM IST

Vinod kumar on BJP: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు దీక్ష చేసే నైతికత ఎక్కడుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నది భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించిన ఆయన... ఏ ముఖం పెట్టుకుని దీక్ష చేస్తారని ఎద్దేవా చేశారు.

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిందేమీ లేదన్న వినోద్... 2014లో కోటి, 2019లో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్రమోదీ మాట నిలుపుకోలేదని ఆక్షేపించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీని ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. అన్ని వర్గాల నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న భాజపాకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వినోద్ కుమార్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details