తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: బండి సంజయ్ - Bjp State President Bandi Sanjay

రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సమాజంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి గణేష్ ఉత్సవాలు సామాజిక బంధంగా పెనవేసుకున్నాయని వెల్లడించారు.

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : బండి సంజయ్
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : బండి సంజయ్

By

Published : Aug 22, 2020, 11:45 AM IST

రాష్ట్ర ప్రజలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సమాజంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి గణేష్ ఉత్సవాలు సామాజిక బంధంగా పెనవేసుకున్నాయని వెల్లడించారు.

గణేశుడి నవరాత్రుల పాత్ర కీలకం...

తెలంగాణ ప్రజానీకంలోనూ వినాయకుడి నవరాత్రి ఉత్సవాల పాత్ర చాలా కీలకంగా మారాయని పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమంలో దేశవ్యాప్తంగా సంఘటనాత్మక భావాన్ని పెంపొందించిన ఈ ఉత్సవాలు.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ ప్రధాన పాత్రను పోషించినట్లు గుర్తు చేశారు. వ్యక్తిగత బంధాలను, సామాజిక బంధాలుగా మల్చడంలో వినాయకుడు, బొడ్డెమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రముఖ పాత్ర వహించడం తెలంగాణ సాంస్కృతి గొప్పతనమన్నారు.

కరోనా తొలగిపోవాలి లంబోదర..

ఈ గణనాథుడి ఉత్సవాలతో సమాజం సామాజికంగా ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారి తొలగిపోవాలని గణపతిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి : నిండుకుండలా ఎల్​ఎండీ... చూసేందుకు పర్యటకుల తాకిడి

ABOUT THE AUTHOR

...view details