తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగపూర్​లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. గరికపాటి ప్రవచనాలు - సింగపూర్​లో వినాయక చవితి వార్తలు

సింగపూర్​లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంతర్జాల మాధ్యమంతో.. ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు పండగ విశిష్టత వివరించారు.

vinayaka-chavithi-festival-celebrations-in-singapoor
సింగపూర్​లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. గరికపాటి ప్రవచనాలు

By

Published : Aug 23, 2020, 3:37 PM IST

వినాయక చవితి సందర్భంగా సింగపూర్​లో శ్రీ సాంస్కృతిక కళాసాథి సంస్థ వారు అంతర్జాలం ద్వారా ఆధ్యాత్మిక ప్రవచన కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు హాజరై.. పండగ విశిష్టత వివరించారు. వినాయకుని రూప విశేషాన్ని, అవతార విశేషాల వెనుక అన్న పరమార్థాన్ని చెప్పారు.

చిత్తశుద్ధి లేని ఆర్భాటాలు, ఆడంబరాలు భక్తి అనిపించుకోవని.. భగవంతునిపై ప్రేమతో చేసే పూజలే సంతృప్తిదాయకంగా ఉండి, సత్ఫలితాలు ఇస్తాయనీ చెప్పారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. ఇంటర్​నెట్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండే విధంగా వేడుక నిర్వహించినట్టు సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:'ఉపాధి హామీ పెంచి.. ఆ పథకం అమలు చేయండి'

ABOUT THE AUTHOR

...view details