ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆలోచనలతో గ్రామాలు మరింత అభివృద్ధి చెంది, పల్లెలు రాష్ట్రానికి పట్టుగొమ్మలుగా మారుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంత్రి సమక్షంలో ఇఇఎస్‌ఎల్, గ్రామ పంచాయతీల మధ్య ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చే ఒప్పందం జరిగింది. కేంద్ర ప్రభుత్వ జాయింట్ వెంచర్ సంస్థ అయిన ఇఇఎస్‌ఎల్‌తో పంచాయతీరాజ్ శాఖకు మధ్య జరిగిన ఒప్పందంతో పల్లెల్లో ఎల్‌ఈడీ లైట్లతో సరికొత్త వెలుగులు అందుతాయన్నారు.
సీఎం ఆలోచనలతో మరింత అభివృద్ధి దిశగా గ్రామాలు - minister errabelli dayakar rao news
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఇఇఎస్‌ఎల్, గ్రామ పంచాయతీల మధ్య ఎల్ఈడీ వీధి దీపాల అమర్చే ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంతో పల్లెల్లో ఎల్‌ఈడీ లైట్లతో సరికొత్త వెలుగులు అందుతాయన్నారు.
సీఎం ఆలోచనలతో మరింత అభివృద్ధి దిశగా గ్రామాలు
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇఇఎస్‌ఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.