CM Jagan Photo in place of Ambedkar photo: ఏపీ కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం రామనపూడి సచివాలయంలో అంబేడ్కర్ చిత్రపటాన్ని తొలగించడంపై గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. గ్రామ సచివాలయంలో అంబేడ్కర్ చిత్రపటాన్ని తీసివేసి ఆ స్థానంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు.
అంబేడ్కర్ స్థానంలో ముఖ్యమంత్రి ఫొటో.. భగ్గుమన్న గ్రామస్థులు - రామనపూడి సచివాలయం వార్తలు
Villagers fire on officers: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా రామనపూడి సచివాలయం వద్ద గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. సచివాలయంలో అంబేడ్కర్ చిత్రపటాన్ని తీసివేసి ఆ స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు. గ్రామస్థుల ఆందోళనకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.
అంబేడ్కర్ స్థానంలో ముఖ్యమంత్రి ఫొటో.. భగ్గుమన్న గ్రామస్థులు
గ్రామస్థుల ఆందోళనకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు పాల్గొని అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. ఆందోళనతో దిగొచ్చిన సచివాలయ సిబ్బంది ముఖ్యమంత్రి ఫొటో తీసివేసి.. తిరిగి యథాస్థానంలో అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఐదేళ్లకోసారి మారే ముఖ్యమంత్రి కోసం, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటాన్ని తొలగించడాన్ని జనసేన పార్టీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.