CARRIED DEAD BODY IN PADERU: ఓ మహిళ మృతదేహాన్ని డోలీలో 6 కిలోమీటర్లు మోసుకెళ్లిన ఘటన.. ఏపీలోని విశాఖ జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో జరిగింది. పాడేరు మండలం కాంగుగెడ్డకు చెందిన మూడు నెలల బాలింత రెండు రోజుల క్రితం పక్షవాతానికి గురైంది. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు రహదారి లేకపోవడంతో 6 కిలోమీటర్ల మేర డోలీలో మోసుకుని, మాడుగుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యవసర చికిత్స నిమిత్తం.. ఆ మహిళను అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
అయితే.. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందింది. అంబులెన్స్‌లో మృతదేహాన్ని రహదారి మార్గం వరకు (CARRIED DEAD BODY IN PADERU) తీసుకొచ్చారు. ఆక్కడి నుంచి వాహనం ముందుకు కదిలే అవకాశం లేకపోవడంతో.. మృతదేహాన్ని చాపలో చుట్టి, కర్రకు కట్టి అత్యంత కష్టం మీద గ్రామానికి చేర్చారు. రోడ్డులేని కష్టాల దారిలో తమ దుస్థితి నిత్యం ఇలాగే ఉంటోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.