KODI KATTI CASE : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై కోడికత్తి దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై విచారణను.. ఈనెల 13కి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మెట్రోపొలిటిన్ సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ జరగ్గా.. నిందితుడు శ్రీనివాసరావును రాజమహేంద్రవరం కారాగారం నుంచి నుంచి బందోబస్తు మధ్య తీసుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు.
కోడికత్తి కేసు నిందితుడి బెయిల్‌పై విచారణ.. నాలుగేళ్లుగా రిమాండ్‌లోనే! - KODI KATTI CASE UPDATES
KODI KATTI CASE UPDATES: కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 13కి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మెట్రోపొలిటిన్ సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ జరగ్గా.. నిందితుడు శ్రీనివాసరావును రాజమహేంద్రవరం కారాగారం నుంచి తీసుకొచ్చారు.
నాలుగేళ్లు దాటినా.. శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వలేదని.. అతని తరఫు న్యాయవాది సలీం వాదించారు. శ్రీనుకు బెయిల్ ఇవ్వాలని, లేదంటే ఏదో ఒక శిక్ష విధించాలని కోరారు. బెయిల్ ఇవ్వొద్దని.. ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ఈనెల 13న నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. అదేరోజు.. కేసు విచారణ అంశంపై షెడ్యూల్ ప్రకటన కూడా ఉంటుందని న్యాయవాది సలీం తెలిపారు. సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని కోడికత్తి శ్రీనివాస్ బంధువులు అన్నారు.
ఇవీ చదవండి: