తెలంగాణ

telangana

ETV Bharat / state

విలువిద్యలో ద్రోణాచార్యుడి శిష్యురాలు.. భారత్​కు బంగారు పతకమే లక్ష్యంగా సాధన - AP Latest News

Archery player Shanmukhi Nagasai: క్రీడలంటే క్రికెట్, కబడ్డీ మాత్రమే కాదని.. విలువిద్యలోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చంటోంది.. ఆ యువ క్రీడాకారిణి. చిన్న వయస్సులోనే సాధన మెుదలుపెట్టి తక్కువ సమయంలోనే ఆర్చరీలో పట్టు సాధించింది. ఇటీవల గుజరాత్‌లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో రాష్ట్ర జట్టు తరఫున ఆడి రజత పతకం సొంతం చేసుకున్న యువ క్రీడాకారిణి నాగసాయిపై ప్రత్యేక కథనం.

Archery player Shanmukhi Nagasai
Archery player Shanmukhi Nagasai

By

Published : Oct 27, 2022, 6:35 PM IST

ఆర్చరీలో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యం: షణ్ముఖి నాగసాయి

Archery player Shanmukhi Nagasai: లక్ష్యానికి విల్లును ఎక్కుపెట్టి, బాణం వదులుతున్న యువతి పేరు షణ్ముఖి నాగసాయి. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి ఉన్న నాగసాయి.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగింది. 2018లో ఏపీ విజయవాడలోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ ప్రారంభించింది. నెల రోజులకే రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2019లో జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-14 ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకుంది. గత ఏడాది సబ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత విభాగంలో రాష్ట్ర జట్టులో మూడో ర్యాంకును సాధించింది. ఇటీవల గుజరాత్‌లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో రాష్ట్ర జట్టు తరపున ఆడి రజత పతకం సొంతం చేసుకుంది.

"నేను నాలుగేళ్ల నుంచి ఆర్చరీ చేస్తున్నాను. ఇటీవల జరిగిన నేషనల్​ గేమ్స్​లో టీం సిల్వల్​ మెడల్​ వచ్చింది. మా అకాడమీ సర్​ చెరుకూరి సత్యనారాయణ సర్​ ఆధ్వర్యంలో మేము ఆడిన 36 నేషనల్​ గేమ్స్​లో సిల్వర్​ మెడల్​ వచ్చింది. 2018లో ఆడటం ప్రారంభించాను. ప్రారంభంలో మిని నేషనల్​ ఆడాను. తర్వాత జరిగిన స్కూల్​ గేమ్స్​లో స్కూల్​ సిల్వర్​ మెడల్​ వచ్చింది. తర్వాత కరోనా వల్ల గ్యాప్​ వచ్చింది. ఇటీవల జరిగిన ఉమెన్​ఆర్​లో ఆలోవర్​ ఇండియాలో 8వ స్థానంలో ఉన్నాను." -నాగసాయి,ఆర్చరీ యువ క్రీడాకారిణి

క్రీడల్లో రాణిస్తూనే చదువును కొనసాగిస్తోంది నాగసాయి. నాలుగేళ్లుగా సాధన చేస్తున్నా ఈ క్రీడలో మెళకువలు ఎంతో ముఖ్యమని చెబుతోంది. జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. రానున్న రోజుల్లో సాధనపై మరింత శ్రద్ధ పెడతానని చెబుతోందీ యువతి.

"క్రీడల్లో రాణిస్తూనే.. చదువును కొనసాగించగలనన్న నమ్మకం నాకుంది. ఈ క్రీడలో మెళకువలు ఎంతో ముఖ్యం. జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో పతకం సాధిస్తాను. రానున్న రోజుల్లో సాధనపై మరింత శ్రద్ధ పెడతాను. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున పాల్గొని.. ఆర్చరీలో బంగారు పతకం సాధించడమే నా లక్ష్యం." -నాగసాయి,ఆర్చరీ యువ క్రీడాకారిణి

ఖర్చుతో కూడుకున్న విలువిద్యకు సంబంధించిన పరికరాల్ని అకాడమీ అందిస్తోందని నాగసాయి తండ్రి చెబుతున్నారు. అబ్బాయిలకు దీటుగా తన కూతురు విలువిద్యలో రాణించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున పాల్గొని.. ఆర్చరీలో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమంటోంది క్రీడాకారిణి నాగసాయి.

"ఖర్చుతో కూడుకున్న విలువిద్యకు సంబంధించిన పరికరాల్ని అకాడమీ అందిస్తోంది. అబ్బాయిలకు దీటుగా తన కూతురు విలువిద్యలో రాణించడం సంతోషంగా ఉంది."-నాగసాయి తండ్రి

ఇవీ చదవండి:వడ్ల కుప్పను తప్పించబోయి బోల్తా కొట్టిన కారు సీసీ కెమెరాలో దృశ్యాలు

'త్వరలోనే పీఓకే స్వాధీనం'.. పాక్​కు రాజ్​నాథ్​ తీవ్ర హెచ్చరికలు

ABOUT THE AUTHOR

...view details