షార్ట్‌సర్క్యూట్‌తోనే ఏపీలోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో మంటలు చెలరేగినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిందని సీపీ అన్నారు.
స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్: సీపీ శ్రీనివాసులు - latest news on fire accident in vijayawada
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని సీపీ శ్రీనివాసులు వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థులో మంటలు అలుముకుని... భవనంలోని ఇతర అంతస్థులకు వ్యాపించినట్లు సీపీ తెలిపారు.
స్వర్ణ ప్యాలెస్‌లో ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్: సీపీ శ్రీనివాసులు
గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థులో మంటలు అలుముకుని... భవనంలోని ఇతర అంతస్థులకు వ్యాపించినట్లు తెలిపారు. ఒకటో అంతస్థు నుంచి నలుగురు వ్యక్తులు దూకారని వెల్లడించారు. మెట్ల ద్వారా బాధితులను బయటకు తీసుకురావడం కుదరలేదని తెలిపారు. ఒకే మార్గం కావడంతో నిచ్చెనల ద్వారా బాధితులను తరలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
TAGGED:
cp on acci