హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో... అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన విజయశాంతి - తెలంగాణ వార్తలు
నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి.. వారితో సరదాగా గడిపారు.
![పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన విజయశాంతి Vijaya Shanti On Women's Day celebrations at hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10920037-875-10920037-1615198068259.jpg)
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన విజయశాంతి
లాక్‌డౌన్ సమయంలో విశేష సేవలందించిన జీహెచ్ఎంసీ మహిళా పారిశుద్ధ్య కార్మికులతో విజయశాంతి సరదాగా గడిపారు. వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారితో ఫొటోలు దిగి ముచ్చటించారు. కరోనా కష్టకాలంలో పడిన ఇబ్బందులను... విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.