Vijaya diet milk : డైటింగ్ చేసేవారి సంఖ్య పెరుగుతున్నందున వారి కోసం ప్రత్యేకంగా పాలు విక్రయిస్తున్నట్లు రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) తెలిపింది. వీరి కోసం ‘డైట్ మిల్క్’ను లీటరు రూ.50కి విక్రయిస్తారు. గతంలో దీని ధర రూ.46 ఉండేది. టోన్డ్ మిల్క్ లీటరు ధరను రూ.51 నుంచి 55కి పెంచారు. ‘హోల్‌మిల్క్’ పేరుతో విక్రయిస్తున్న పాల లీటరు ధరను రూ.68 నుంచి 70కి పెంచినట్లు విజయ డెయిరీ తెలిపింది.
Vijaya diet milk : డైటింగ్ చేసేవారికి ప్రత్యేకంగా పాలు.. లీటరు ధర ఎంతంటే..? - Vijaya diet milk price for liter
Vijaya diet milk : మీరు డైటింగ్ చేస్తున్నారా.. అయితే మీలాంటి వారి కోసమే విజయ డెయిరీ ప్రత్యేకంగా పాలు విక్రయిస్తోంది. డైటింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు డెయిరీ తెలిపింది. అసలు ఆ పాల ధర లీటర్ ఎంతంటే..?
డైటింగ్ చేసేవారికి ప్రత్యేకంగా పాలు.. లీటరు ధర ఎంతంటే..?
అలాగే కేవలం టీ(చాయ్) తయారీకి వినియోగించేందుకు ‘టీ స్పెషల్’ పేరుతో మరో రకం పాలను విడిగా అమ్ముతున్నారు. వీటి ధరను లీటరుకు రూ.50 నుంచి 54కి పెంచారు. అయితే నెలవారీ పాలకార్డులు కొనుగోలు చేసిన వారికి ఈ నెల 13 వరకూ పాత ధరలపైనే విక్రయిస్తామని, చిల్లరగా కొనేవారు పెంచిన ధరలనే చెల్లించాలని డెయిరీ సూచించింది.