ECET New Convener: ఈసెట్ నూతన కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ మెకానికల్ విభాగం ఆచార్యుడు కె.విజయ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, నిర్వహించే వర్సిటీల పేర్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి శుక్రవారం వెల్లడించారు. ఎంసెట్ కన్వీనర్‌గా గోవర్ధన్ మరోసారి నియమితులయ్యారు. మిగిలిన ప్రవేశ పరీక్షల కన్వీనర్లు అందరూ పాతవారే. పీఈసెట్ కన్వీనర్, వర్సిటీలను తర్వాత ప్రకటిస్తామని లింబాద్రి తెలిపారు.
ECET New Convener: ఈసెట్ ప్రవేశ పరీక్షలకు నూతన కన్వీనర్ నియమాకం - ప్రవేశ పరీక్షల కన్వీనర్లు
ECET New Convener: వచ్చే విద్యా సంవత్సరం(2022-23)లో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు ఈసెట్ తప్ప మిగిలిన అన్నింటికీ పాతవారే కన్వీనర్లుగా నియమితులయ్యారు. మిగిలిన ప్రవేశ పరీక్షల కన్వీనర్లు అందరూ పాతవారే. పీఈసెట్ కన్వీనర్, వర్సిటీలను తర్వాత ప్రకటిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు.
ఈసారి ప్రవేశపరీక్షలను జూన్ నెలాఖరు లేదా జులై మొదటివారం ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. గత ఏడాది జూన్ నెలాఖరులో అనుకున్నా కరోనా కేసుల కారణంగా చివరకు ఆగస్టు 3 నుంచి పరీక్షలు మొదలయ్యాయి. ఈసారి మూడో వేవ్ ఫిబ్రవరిలో తగ్గుముఖం పట్టవచ్చని అధ్యయనాలు చెబుతున్నందున గతేడాది కంటే ముందే ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. అయితే కరోనా పరిస్థితులను బట్టే తేదీలు ఖరారయ్యే అవకాశముంది.
ఇదీ చూడండి:Telangana Loan: మరో మూడు వేల కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కారు..