సామాజిక మాధ్యమాల్లో సినీ హీరో విజయ్ దేవరకొండ పేరుతో తన ఫోన్ నంబర్ పెట్టి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌దేవరకొండను కలవాలంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతూ... అమ్మాయిలతో చాట్ చేస్తున్నట్లు విజయ్ దేవరకొండ మేనేజర్ గోవింద్ ఈనెల 3న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు సందేశాలు పంపిన వ్యక్తి అరెస్ట్ - sending messages with fake id
హీరో విజయ్ దేవరకొండ పేరుతో నకిలీ సోషల్ మీడియా ఐడీలతో అమ్మాయిలను ట్రాప్ చేస్తోన్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. విజయ్ దేవరకొండను కలవాలంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయాలంటూ నిందితుడు సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టినట్లు అర్జున్ రెడ్డి మేనేజర్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
విజయదేవరకొండ పేరుతో అమ్మాయిలకు సందేశాలు పంపిన వ్యక్తి అరెస్ట్
ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడి ఫేస్బుక్ ఐడీ, మొబైల్ నంబర్ ఆధారంగా బాన్సువాడ మిర్జాపూర్ గ్రామంలో నిందితుడు సాయికిరణ్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్‌కు తరలించారు. విచారించిన అనంతరం 41ఏ సీఆర్పీసీ కింద నోటిసులు జారీ చేసినట్లు ఏసీపీ ప్రసాద్ తెలిపారు.