Vigilance Searches on Kaleshwaram Projects : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రాష్ట్రం నుంచి ఇంజినీరింగ్, పోలీస్, విజిలెన్స్ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. మహాదేవపూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం, కన్నేపల్లి పంప్ హౌస్ కార్యాలయాల్లో రికార్డులను విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Medigadda Barrage Latest News : మంగళవారం రాత్రి కన్నెపల్లి, మేడిగడ్డ కార్యాలయాల్లో రికార్డులు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకొని డివిజన్ కార్యాలయానికి తరలించారు. మంగళవారం రాత్రి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మేడిగడ్డ గెస్ట్ హౌస్‌లో అధికారులు బస చేశారు.
ఈ ఉదయం తిరిగి మహదేవ్పూర్ నీటి పారుదలశాఖ కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు. మొత్తం 10 మంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రాజెక్టు డిజైన్, మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల నివేదిక, పంప్ హౌస్ గోడ కూలడానికి దారితీసిన పరిస్ధితులు, పునరుద్ధరణ పనులు, చెల్లింపు, వరద నీటి విడుదల తదితర అంశాలకు సంబంధించిన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వరకూ సోదాలు చేసి బృందం హైదరాబాద్ వెళ్లనుంది.
కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల సోదాలు
Medigadda Barrage Issue Update :మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన వ్యవహారంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దృష్టిసారించింది. మేడిగడ్డ బ్యారేజీ, పంప్‌హౌస్‌కు సంబంధించిన వివరాన్నింటిని అందజేయాలని లేఖ రాసిన 24 గంటలు గడవక ముందే, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల సోదాలు ప్రారంభించారు.
Vigilance Checks on Medigadda Barrage : హైదరాబాద్ జలసౌధలోని కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఎండీ హరిరామ్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు కార్యాలయాల్లో అధికారులు ఉదయం 9గంటల నుంచి 8 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ముందుగా ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఎవరిని బయటకు వెళ్లనీయకుండా సంబంధిత సిబ్బంది, ఛాంబర్లలో అధికారులు డాక్యుమెంట్లను పరిశీలించారు.
Telangana Govt Orders Vigilance Inquiry to Medigadda Barrage :మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, సిట్టింగ్ న్యాయమూర్తి చేత న్యాయవిచారణ జరిపిస్తామని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాశారని ఉత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ ఘటన - 'ఆ మూడు పియర్స్ కుంగుబాటుతో ఆనకట్ట మొత్తం కదిలింది'