తెలంగాణ

telangana

ETV Bharat / state

మెడికల్​ దుకాణాలపై విజిలెన్స్​ అధికారుల దాడులు - vigilance officers rides on medical stores in hyderabad

కోఠి ఇందర్​బాగ్​లోని పలు మెడికల్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కరోనాను ఆసరాగా చేసుకుని పలు మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు.. నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేశారు.

vigilance officers rides on medical stores
vigilance officers rides on medical stores

By

Published : May 2, 2021, 4:53 AM IST

హైదరాబాద్ కోఠి ఇందర్​బాగ్​లోని పలు మెడికల్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. వివిధ రకాల మందులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ఔషధ దుకాణదారులు మందులపై ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో వినియోగదారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు.. పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఎన్ 95 మాస్కులు, శానిటైజర్స్​తో పాటు పలు మందులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మడం, పాత ఎమ్మార్పీ స్టిక్కర్లు తీసేసి, మరో స్టిక్కర్​ వేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని విజిలెన్స్ సీఐ అజయ్ తెలిపారు. నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేసి, పలు మందులు, ఎన్-95 మాస్కులు, శానిటైజర్​ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: ఈటల రాజేందర్ భూముల వ్యవహారంపై సీఎస్‌కు మెదక్‌ కలెక్టర్‌ నివేదిక

ABOUT THE AUTHOR

...view details