తెలంగాణ

telangana

ETV Bharat / state

అధిక ధరలు వసూలు చేస్తున్న ఆసుపత్రులు.. అధికారుల దాడులు - కొవిడ్ ఆసుపత్రులు తాజా వార్తలు

కరోనా బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా ఫ్లైయింగ్​ స్క్వాడ్​ అధికారులు దాడులు నిర్వహించారు. రోగుల ఫిర్యాదు మేరకు కొన్ని ఆసుపత్రుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి అధిక ధరలు వసూలు చేస్తున్న ఆసుపత్రి యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

vigilance-officers-raids-on-hospitals-in-the-state-over-compliance-of-higher-prices
అధిక ధరలు వసూలు చేస్తున్న ఆసుపత్రులు..

By

Published : Apr 28, 2021, 8:36 AM IST

అధిక ధరలు వసూలు చేస్తున్న ఆసుపత్రులు..

ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలను కరోనా బాధితుల నుంచి వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏపీలోని 25 ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా ఆసుపత్రుల్లో ఆక్సిజన్, రెమ్​డెసివిర్​, ఇతర కరోనా మందుల నిల్వలు సరఫరాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో నర్సరావుపేటలోని ఓ హాస్పిటల్​లో రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. తిరుపతిలోని మరో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఉన్నపటికీ రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్టు అధికారులు గుర్తించారు.

విజయనగరం, ప్రకాశం, ఒంగోలులోని కొన్ని ఆసుపత్రుల్లో అవసరం కంటే ఎక్కువగా రోగుల పేరుతో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు ఇండెంట్ పెట్టి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిన సదరు హాస్పిటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వివరించారు. ఏపీలోని అన్ని ఆసుపత్రుల యాజమాన్యాలను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా వ్యాధి చికిత్సలు అందించవలసినదిగా కోరారు. ఆసుపత్రుల్లో అధిక ధరల నియంత్రణ కోసం జిల్లా స్థాయిలో వైద్యాధికారులు, ఔషధ నియంత్రణ, విజిలెన్సు సంబంధిత అధికారులతో కూడిన 18 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి:కాసుల కక్కుర్తి.. రెమ్​డెసివిర్​ పేరిట దోపిడి దందా

ABOUT THE AUTHOR

...view details