తెలంగాణ

telangana

ETV Bharat / state

'సంపూర్ణ ఆరోగ్యవంతులే... నిజమైన భాగ్యవంతులు' - 'సంపూర్ణ ఆరోగ్యవంతులే... నిజమైన భాగ్యవంతులు'

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లో కిమ్స్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్వర్ణభారత్‌ ట్రస్టులో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శిబిరాన్ని ప్రారంభించారు.

'సంపూర్ణ ఆరోగ్యవంతులే... నిజమైన భాగ్యవంతులు'

By

Published : Sep 22, 2019, 8:19 PM IST

'సంపూర్ణ ఆరోగ్యవంతులే... నిజమైన భాగ్యవంతులు'

సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన భాగ్యవంతులని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ ముచ్చింతల్‌లో కిమ్స్‌ ఆసుపత్రి సహకారంతో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళి సౌందరరాజన్‌ తొలిసారి తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. డాక్టర్‌గా స్వర్ణభారత్‌ ట్రస్ట్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రెండు, మూడువారాల్లో వెంకయ్య ఆశీస్సులతో పూర్తిగా తెలుగులో మాట్లాడతానని వెల్లడించారు. పేదలకు వైద్య సేవలు అందించడం చాలా గొప్పవిషయమని అభిప్రాయపడ్డారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు చేరవేస్తున్న స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ సేవలు ప్రశంసనీయమని కొనియడారు. పట్టణాల్లో పనిచేసే వైద్యులు వారంలో ఒకరోజు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని వెంకయ్యనాయుడు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details