తెలంగాణ

telangana

ETV Bharat / state

సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి - ఏపీ వార్తలు

తిరుమల శ్రీవారిని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. సామాన్య భక్తుడిలా వైకుంఠద్వారం ద్వారా కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు.

సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

By

Published : Mar 5, 2021, 8:57 AM IST

తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. సామాన్య భక్తుడిలా వైకుంఠద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు తీర్థ శఠారితో ఆశీర్వదించారు.

రంగనాయకుల మండపంలో వెంకయ్యనాయుడు దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా... ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. దేశ ప్రజల ఆరోగ్యం, సుఖ శాంతుల కోసం స్వామి వారిని ప్రార్థించానని ఉపరాష్ట్రపతి తెలియజేశారు.

సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

ఇదీ చూడండి:తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details