ఏపీ, తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుపతికి చేరుకున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి.. రేపు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొననున్నారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉప రాష్ట్రపతి - తిరుమలను చేరుకున్న ఉప రాష్ట్రపతి
ఏపీ, తిరుమలలోని శ్రీవారిని ఉప రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. ఈరోజు ఉదయాన్నే తిరుపతికి విచ్చేసిన వెంకయ్య నాయుడు.. పలు కార్యక్రమాలలో పాల్గొని కొండపైకి చేరుకున్నారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉప రాష్ట్రపతి
ఈరోజు ఉదయాన్నే తిరుమలకు విచ్చేసిన వెంకయ్యనాయుడు.. తిరుపతి నగరంలోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణాకుమారి, తదితరులు పాల్గొన్నారు.