తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం వల్లే ప్రకృతి వైపరీత్యాలు: ఉపరాష్ట్రపతి

హరిత భవనాలు నిర్మించుకునే వారికి స్థానిక సంస్థలు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇండియన్ గ్రీన్​ బిల్డింగ్ కౌన్సిల్​ నిర్వహిస్తున్న గ్రీన్​ బిల్డింగ్​ కాంగ్రెస్​ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆన్​లైన్​లో హాజరయ్యారు.

vice president venkaiah naidu
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

By

Published : Oct 29, 2020, 2:56 PM IST

వర్షపు నీరు సంరక్షణ, ఎనర్జీ సేవింగ్, పునరుత్పాదక విద్యుత్​ను ఉపయోగించే వారిని ప్రోత్సహిస్తే. హరిత భవనాల నిర్మాణం ఊపందుకుంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గ్రీన్​ బిల్డింగ్​ కాంగ్రెస్​ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వెంకయ్య.. గ్రామీణాభివృద్ధి శాఖ, పట్టణాభివృద్ధి శాఖ దృష్టి సారించి స్థానిక సంస్థలను ప్రోత్సహించాలని సూచించారు.

పర్యావరణాన్ని కాపాడుకుంటే సమస్యలు ఉండవని, పర్యావరణాన్ని పట్టించుకోకపోవటం వల్లే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. అందుకే ప్రజల ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తరచూ వరదలు, కరవు లాంటివి చూస్తున్నామని, గ్లోబల్ వార్మింగ్​పై విప్లవాత్మకమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details