తెలంగాణ

telangana

By

Published : Mar 1, 2021, 3:28 PM IST

ETV Bharat / state

తూర్పు నావికా దళాధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్

తూర్పు నావికాదళాధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ బాధ్యతలు స్వీకరించారు. దేశ భ‌ద్రత ప‌రిర‌క్షణ‌లో నౌకాద‌ళ పాత్ర తిరుగులేనిదని వైస్‌ అడ్మిరల్‌ ఎ.బి.సింగ్‌ అన్నారు. తూర్పు నౌకాద‌ళం ఎలాంటి స‌వాళ్లకైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

nayv
nayv

తూర్పు నావికా దళాధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం ఐఎన్ఎస్ స‌ర్కార్స్ మైదానంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. దిల్లీకి బ‌దిలీపై వెళ్తున్న ఎ.కె.జైన్ నుంచి ఎ.బి.సింగ్‌ బాధ్యతలు స్వీకరించారు. తూర్పు నావికాద‌ళంలోని వివిధ యూనిట్ల నుంచి ఎ.కె.జైన్‌ వీడ్కోలు వంద‌నాన్ని స్వీక‌రించారు. నూత‌న తూర్పు నావికా ద‌ళాధిప‌తి వైస్ అడ్మిర‌ల్ ఎ.బి.సింగ్ ప‌రేడ్‌ను ప‌రిశీలించారు.

దేశ భ‌ద్రత ప‌రిర‌క్షణ‌లో నావికాద‌ళ పాత్ర తిరుగులేనిదని వైస్‌ అడ్మిరల్‌ ఎ.బి.సింగ్‌ అన్నారు. పాక్‌పై సాధించిన విజ‌యానికి 50 వ‌సంతాలు పూర్తయ్యాయని.. అప‌రేష‌న్ ప‌వ‌న్ శ్రీ‌లంకలో విజ‌య‌వంతంగా నిర్వహించామని హర్షం వ్యక్తం చేశారు. సామ‌ర్థ్యాలు, పోరాట పాట‌వాల‌ను న‌వీక‌రించుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. తూర్పు నావికాద‌ళం ఎలాంటి స‌వాళ్లకైనా సిద్ధంగా ఉందని ఎ.బి.సింగ్‌ అన్నారు.

తూర్పు నావికా దళాధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్

ఇదీ చదవండి:'పోలీసుల నిర్లక్ష్యం వల్లే వామనరావు దంపతుల హత్య'

ABOUT THE AUTHOR

...view details