రాష్ట్రంలోని సాంస్కృతిక కార్యక్రమాలపై కరోనా ప్రభావం పడింది. నిత్యం కళాకారులు, కళాప్రదర్శనలతో కళకళలాడే ప్రాంగణాలు వెలవెల బోతున్నాయి. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే ఈ కార్యక్రమాలు.. తన వేదికను మార్చుకున్నాయి.
సామాజిక మాధ్యమాల ద్వారా...
సాంస్కృతిక కార్యక్రమాలను నేరుగా జన బహుళ్యంలో వీక్షించే ప్రజలు.. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ తన వేదికను సంప్రదాయ విధానం నుంచి డిజిటల్ విధానంలోకి మార్చుకుందన్నారు.