పాతబస్తీ ఉప్పుగూడ కాళికా మాత దేవాలయ భూములను కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సందర్శించారు. పార్టీ నేతలతో కలిసి భూములను పరిశీలించారు.
పబ్లిసిటీ కోసమే భాగ్యలక్ష్మి ఆలయ సందర్శనలు: వీహెచ్ - vh latest news
పబ్లిసిటీ కోసమే భాజపా నాయకులు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శించారు. దేవాలయ భూముల కబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పబ్లిసిటీ కోసమే భాగ్యలక్ష్మి ఆలయ సందర్శనలు: వీహెచ్
ఈ సందర్భంగా కాళికా మాత దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలాల కబ్జాకు పాల్పడిన శేరి నర్సింహారెడ్డి భాజపా నాయకుడా.. కాదా బండి సంజయ్ చెప్పాలని హనుమంతరావు పేర్కొన్నారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పబ్లిసిటీ కోసమే భాజపా నాయకులు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి: 'భూ కబ్జాలు చేసే వారికి శిక్ష పడేలా చట్టం తీసుకురావాలి'