మేడ్చల్ జిల్లా కీసర గ్రామపంచాయతీలో కేవీఆర్ వెంచర్ ముందు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆందోళన చేపట్టారు . కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు 90 ఎకరాల భూమికి జారీ చేసిన పాస్ బుక్‌లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ.. బాధిత ఎస్సీలతో కలసి నిరసనలో పాల్గొన్నారు.
రెవెన్యూ చట్టంలో కొత్త మార్పులు అవసరం: వీహెచ్ - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు 90 ఎకరాల భూమికి జారీ చేసిన పాస్ బుక్‌లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ.. బాధిత ఎస్సీలతో కలసి కేవీఆర్ వెంచర్ ముందు వీహెచ్ నిరసన చేపట్టారు. కీసర ఎస్సీలకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాతామని తెలిపారు.
![రెవెన్యూ చట్టంలో కొత్త మార్పులు అవసరం: వీహెచ్ vh protest at kvr venchar, medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8687968-407-8687968-1599294970120.jpg)
రెవెన్యూ చట్టంలో కొత్త మార్పులు రావాల్సిన అవసరం ఉంది: వీహెచ్
ఎస్సీల భూముల్లో రియల్టర్లతో కుమ్మక్కైన నాగరాజు, అక్రమంగా ఎలా పాసు పుస్తకాలు జారీ చేశారని ప్రశ్నించారు. కీసర ఎస్సీలకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాతామని తెలిపారు. రెవెన్యూ చట్టంలో కొత్త మార్పులు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ… సీన్ రివర్స్: యువకుడిపై యువతి యాసిడ్ దాడి