తెలంగాణ

telangana

ETV Bharat / state

'యురేనియం తవ్వకాలపై కేసీఆర్​ స్పష్టత ఇవ్వాలి'

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కాంగ్రెస్​ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్​ చేశారు. కేసీఆర్​ యురేనియం తవ్వకాలు జరగనివ్వమంటున్నా.. కేంద్ర మంత్రి ప్రకాశ్​ జవడేకర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలు జరుగుతాయని అంటున్నారని.. దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు.

Vh_On_Uranium explosions
'యురేనియం తవ్వకాలపై కేసీఆర్​ స్పష్టత ఇవ్వాలి'

By

Published : May 18, 2020, 4:16 PM IST

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్​ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్​ చేశారు. ఓవైపు ప్రపంచమంతా కరోనాతో కొట్టుమిట్టాడుతుంటే.. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై అన్వేషణ ప్రారంభమైందని ఆరోపించారు.

'యురేనియం తవ్వకాలపై కేసీఆర్​ స్పష్టత ఇవ్వాలి'

గత నెల 23న కేంద్రం నుంచి తెలంగాణకు లేఖ రాగా.. అందులో నల్లమల అటవీ ప్రాంతంలో జంతువులు, వృక్షాలు తదితర వివరాలు కోరారని వివరించారు. కేసీఆర్​ నల్లమలలో యురేనియం తవ్వకాలు జరగనివ్వబోమని చెబుతుండగా.. కేంద్ర మంత్రి ప్రకాశ్​ జవడేకర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం తవ్వకాలు ఆగవని అంటున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టత ఇవ్వాలని వీహెచ్​ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:వలస కూలీలను ఫోన్​ నంబర్​తో పట్టేస్తారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details