తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​పై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు: వీహెచ్ - తెరాసపై వీహెచ్ మండిపాటు

రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్​పై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. తనపై అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు.

కాంగ్రెస్ పై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు: వీహెచ్
కాంగ్రెస్ పై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు: వీహెచ్

By

Published : Jul 30, 2020, 4:28 PM IST

రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలపై ముఖ్యంగా కాంగ్రెస్​పై ఎక్కువగా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. దళితులు చనిపోతే చూడడానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

మంత్రులు కొందరు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. ఉస్మానియా ఆసుపత్రిని కట్టమని అన్నందుకే తనపై కక్ష్యపూరితంగా కేసులు పెడుతున్నారని తెలిపారు. సచివాలయం కోసం రూ.500 కోట్లతో డిజైన్‌ చేసి సిద్ధంగా ఉంచారని... కానీ ఉస్మానియా హాస్పిటల్​పై ఎందుకు సిద్ధం చేయలేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details