తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మాయిలను గిల్లడమేనా... ఫ్రెండ్లీ పోలీసింగ్?: వీహెచ్​ - అమ్మాయిలను గిల్లడమేనా... ఫ్రెండ్లీ పోలీసింగ్?: వీహెచ్​

ఆయుర్వేద ఆసుపత్రి డైరెక్టర్​ అలుగు వర్షిణీని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ కలిశారు. ఆసుపత్రిని తరలించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటని ఆమెని అడిగారు. పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ అమ్మయిలపై దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్మాయిలను గిల్లడమేనా... ఫ్రెండ్లీ పోలీసింగ్?: వీహెచ్​

By

Published : Aug 1, 2019, 2:26 PM IST

హైదరాబాద్ చార్మినార్ వద్ద ఉన్న ఆయుర్వేద వైద్యశాలను ఎందుకు తరలిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్​ ప్రశ్నించారు. చారిత్రక హాస్పిటల్​ను తరలించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ఆయుష్‌ డైరెక్టర్​ అలుగు వర్షిణీని కలిసి అడిగారు. వైద్య విద్యార్థినులు ధర్నా చేస్తున్నప్పుడు... పోలీసులు తప్పుగా ప్రవర్తించడంపై మండిపడ్డారు. ఆడపిల్లల్ని గిల్లడమేనా... ఫ్రెండ్లీ పోలీసింగ్​ అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ... భేటీ బచావ్​.. భేటీ పడావ్​ అంటారు... కానీ ప్రభుత్వాలే అమ్మయిలపై దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్మాయిలను గిల్లడమేనా... ఫ్రెండ్లీ పోలీసింగ్?: వీహెచ్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details