కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.రెండు లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారి పిల్లలకు జవహర్ నవోదయ స్కూల్స్‌లో ప్రవేశాలు కల్పించాలని కోరారు. ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఇతర అంశాలను పక్కన పెట్టి కొవిడ్ నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీహెచ్ లేఖ - సీఎంకు వీహెచ్ లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.రెండు లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని కోరారు. కొవిడ్ నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
vh
ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడదని ఇంతకు ముందే ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారని గుర్తు చేశారు. కరోనా రోగులకు కిట్స్ పంపిణీ చేయాలన్నారు. ఇటీవల గాంధీ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్... కరోనా చికిత్సకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని చేస్తుందని పేర్కొన్నట్లు తెలిపారు.