రైతుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్ష విరమించారు. అంబర్‌పేటలోని తన నివాసంలో చేపట్టిన దీక్షను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి... వీహెచ్‌ను పరామర్శించి దీక్షను విరమింపజేశారు. హనుమంతరావు దీక్ష చేయడం అభినందనీయమని ఉత్తమ్ పేర్కొన్నారు. వీహెచ్ లేవనెత్తిన డిమాండ్ల పట్ల పార్టీలో చర్చించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. అన్ని జిల్లాల కార్యాలయాలలో ఒకరోజు దీక్ష చేస్తామన్నారు. కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
నిరాహార దీక్ష విరమించిన వీహెచ్ - రైతుల కోసం వీహెచ్ నిరాహార దీక్ష
హైదరాబాద్ అంబర్‌పేటలోని తన నివాసంలో చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు. రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన దీక్ష చేపట్టారు.
నిరాహార దీక్ష విరమించిన వీహెచ్