తెలుగు పరిశోధక విద్యార్థులకు కేంద్రం, యూజీసీ అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావు అన్నారు. ఫెలోషిప్‌లో అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 30న పరిశోధన విద్యార్థుల ధర్నాకు కాంగ్రెస్ మద్దతిస్తుందని వెల్లడించారు. రాజీవ్ గాంధీ ఫెలోషిప్‌ను మూడేళ్లు ఆపేశారన్నారు. దీనిపై భాజపా, ఏబీవీపీ ఎందుకు మాట్లాడటం లేదని వీహెచ్ ప్రశ్నించారు. రిజర్వేషన్లు సమిక్షించాలని మోహన్ భగవత్ అనడం కుట్రలో భాగమేనని చెప్పారు. కొత్త విద్యా విధానం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు.
"ఫెలోషిప్‌లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం"
ఫెలోషిప్‌లో తెలంగాణ విద్యార్థులకు కేంద్రం తీరని అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు ఆరోపించారు.
'ఫెలోషిప్‌లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం'