కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో నినాదంతో పోరాటం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ప్రకటించారు. ఈ నెల 30న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించనున్న భారత్ బచావో కార్యక్రమం తర్వాత ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణలో పేద ప్రజల కోసం కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో నినాదంతో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు 45 రోజులు విచారణ జరిపి ఇప్పుడు లేబర్ కోర్టుకు పొమ్మనడం వల్ల ప్రజలకు న్యాయ వ్యవస్థపైన నమ్మకం సన్నగిల్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
'కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో'
ఇందిరాగాంధీ దేశంలోని పేదరికాన్ని తగ్గించేందుకు గరాబీ హఠావో, దేశ్ బచావో అనే నినాదాన్ని ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో పేద ప్రజల కోసం కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో నినాదంతో పోరాటాలు చేయాలి: వీహెచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
'కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో'