సచివాలయం సందర్శనకు తనను అనుమతించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. విపక్షాలను చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని హైదరాబాద్ సచివాలయం ప్రాంగణం వద్ద ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు మహిళా అధికారిణిపై దాడి చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. తాను మాజీ ఎంపీగా పార్లమెంటుకైనా వెళ్లగలుగుతానని... సచివాలయంలోకి అనుమతించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్పై ప్రజలకు నమ్మకం పోతుందని విమర్శించారు.
'నన్ను అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధం' - వీహెచ్ హనుమంతరావు
ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలను చూసి భయపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు. తనను సచివాలయం సందర్శనకు అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
!['నన్ను అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3711261-thumbnail-3x2-vhgupta.jpg)
హనుమంతరావు