రాష్ట్రంలో కరోనా చికిత్సకు రోజుకు పదివేలకు మించి ఖర్చు రాదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పడం హస్యాస్పదంగా ఉందని వి.హనుమంతురావు అన్నారు. కరోనా వైద్యం పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటున్నా చర్యలెందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.
'కరోనా చికిత్సకు పదివేలే అవుతాయనడం హాస్యాస్పదం' - మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రశ్నించిన హనుమంతరావు
తెలంగాణలో కొవిడ్-19 వ్యాధి చికిత్సకు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ రూ.10 వేలకు మించి ఖర్చకాదని చెప్పడం న్యాయమా అని కాంగ్రెస్ నేత వి.హనుమంతురావు ప్రశ్నించారు. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లొదంటరూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం ఉండదని ఆరోపించారు.
తానూ, తన భార్య అపోలో ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకున్నామని..తమకు సుమారు రూ.5.50 లక్షలు అయ్యిందన్నారు. కొన్ని ఆస్పత్రుల్లో రోగులపై లక్షలాది రూపాయల బిల్లులు వేస్తూ దండుకుంటున్నారని ఆరోపించారు. ఎక్కువగా భూములున్న వారి వద్ద నుంచి ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలన్నారు. కానీ మెదక్‌లో కేవలం 13 గుంటల భూమి ఉన్న రైతు దగ్గర నుంచి లాక్కోవడం వల్ల నర్సింహులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. హరిజనులకు, గిరిజనులకు ఇచ్చిన భూములను తిరిగి లాక్కోవడం సరికాదన్నారు.
ఇదీ చూడండి :భూ కబ్జాదారులపై నిఘా వర్గాల నివేదిక.. అనుచరుల్లో గుబులు