ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన కారణంగానే మహబూబాబాద్ డిపో కార్మికుడు సురేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాశాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. లేఖను పరిగణలోకి తీసుకుని సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపకపోవడం దారుణమన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి.. ఆర్టీసీ ఐకాస ప్రతినిధులను పిలిపించి మాట్లాడాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ తీరుతోనే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు: వీహెచ్
ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడం వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. మహబూబాబాద్ డిపో కార్మికుడు నరేశ్ తన ఆత్మహత్యకు కేసీఆర్ కారణమంటూ లేఖ రాశాడని చెప్పారు. లేఖను పరిగణలోకి తీసుకుని సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
వి.హనుమంతరావు
TAGGED:
ts rtc strike latest news